‘బంధు ప్రీతి’ పై రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు!

Edari Rama Krishna

తెలుగు, హిందీ భాషల్లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. ‘శివ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సృష్టించిన ఈ దర్శకుడు తర్వాత బాలీవుడ్ పయణం అయ్యాడు. అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ చిత్రాలు తీసి తర్వాత వరుస పరాజయాలు పొందాడు. అప్పటి నుంచి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. ఇక హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెలకొన్న బంధుప్రీతిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ప్రముఖులను నెటిజెన్లు విమర్శిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు.

 

నాకు తెలిసి బాలీవుడ్ టాప్ స్టార్స్ లో సుశాంత్ ఒకరిని.. అతని మార్కెట్ వ్యాల్యూ రూ. 75 కోట్లని చెప్పారు. అలాంటి హీరోని ఎవరో డ్యామేజ్ చేస్తే కావడం కల అన్నారు. బాలీవుడ్ లో ప్రతి యేటా దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయని... వాటిలో 10 సినిమాలను నియంత్రించడం దర్శకనిర్మాత కరణ్ జొహార్ వల్ల కాదని చెప్పారు.

 

 అప్పట్లో ఓ తమిళ నటుడిని కలిశానని.. అతను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయానని అన్నారు. అల్లు అర్జున్, రానా కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇంతకీ ఆ తమిళనటుడు ఎవరో మాత్రం రివీల్ చేయలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: