ఇదో కొత్త అవతారం.. నరేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన నానీ..?
తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ హాస్యభరితమైన సినిమాల్లో నటించిన నరేష్ మొదటిసారిగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఇక తాజాగా విడుదలైన టీజర్ లో కూడా అల్లరి నరేష్ నగ్నంగా కనిపించడం మరింత హైప్ తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది, తాజాగా ఈ టీజర్ పై స్పందించిన నాచురల్ స్టార్ నాని... అదిరిందిరా హ్యాపీ బర్త్ డే టూ యు... కొత్త అవతారం అంటూ అల్లరి నరేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Adhirindhi ra .. happy birthday to you and to your brand new avatar 🤗
Looking forward to this one #Naandhi #Naresh57 @allarinaresh https://t.co/tR2TJwtzst — nani (@NameisNani) June 30, 2020