2013 నుంచే మోకా హత్యకు ప్రణాళికలు.... ఆధిపత్య పోరులో భాగంగానే హత్య ...?
రాష్ట్రంలో కొల్లు రవీంద్ర అరెస్ట్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 2013 నుంచే మోకా హత్యకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికాసేపట్లో కొల్లు రవీంద్రను న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తామని వ్యాఖ్యలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు కొల్లు రవీంద్రకు ముఖ్య అనుచరుడని చెప్పారు.
ఆధిపత్య పోరుతోనే మోకా హత్య జరిగిందని అన్నారు. ప్రధాన నిందితుడు నాంచారయ్య, మోకాకు మధ్య విబేధాలు ఉన్నాయని అన్నారు. పేర్లు బయటకు రావద్దని కొల్లు రవీంద్ర ముద్దాయికి చెప్పారని ... కేసులో ప్రధాన నిందితుడు మోకాను హత్య చేస్తానని రవీంద్రకు చెప్పి.... పథకం ప్రకారం హత్య చేశాడని అన్నారు. మార్కెట్ కు పిలిచి మోకాను హత్య చేసినట్లు తెలిపారు.