బ్రేకింగ్ : ఏపీలో కరోనా కల్లోలం... ఒక్కరోజే 765 కేసులు.... 12 మంది మృతి

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 765 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసులలో రాష్ట్రానికి చెందిన కేసులు 727 కాగా ఇతర మిగిలినవి ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 17.699కు చేరింది. ఈ కేసులలో 9,473 యాక్టివ్ కేసులు ఉండగా 8,008 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 12 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 218కి చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 24,962 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: