బ్రేకింగ్ : చైనాకు యాపిల్ భారీ షాక్... 4500 గేమ్స్ తొలగింపు....?
కొన్ని రోజుల క్రితం కేంద్రం 59 చైనా యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చైనా లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. అయితే ఇదే సమయంలో చైనాకు దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ భారీ షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్‌లోని 4500 మొబైల్ గేమ్స్‌ను గడిచిన మూడు రోజుల్లో తొలగించింది. యాపిల్ భారీ స్థాయిలో గేమ్స్ ను తొలగించడంపై చైనీస్ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్ రూల్స్ పాటించని యాప్ లను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. లైసెన్స్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని గత ఏడాదే ప్రకటించామని తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టామని యాపిల్ తెలిపింది. ఈ పరిణామం చైనా కంపెనీలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.