బీసీల ఆత్మాభిమానం కాపాడింది సీఎం జగన్ మాత్రమే : అనిల్ కుమార్ యాదవ్

Reddy P Rajasekhar

వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బీసీ నేతలను వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ముద్దాయి అని చెప్పారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మహిళలను వేధించారని.... నేరం చేసిన వాళ్లను శిక్షిస్తే విమర్శలా....? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి రౌడీయిజం చేస్తోందని అన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. 
 
వైసీపీ అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తుంటే టీడీపీ పథకాలను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పటు బాబుకు బీసీలు గుర్తుకు రాలేదని వ్యాఖ్యలు చేశారు. బీసీల ఆత్మాభిమానం కాపాడుతున్న పార్టీ వైసీపీ అని అన్నారు. టీడీపీ చౌకబారు రాజకీయాలను మానుకోవాలని సూచించారు. చట్టం ముందు అన్ని కులాలు ఒకటేనని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: