డిగ్రీ విద్యార్ధులు పరిక్షలు రాయాల్సిందే: యుజీసీ

కరోనా దెబ్బకు విద్యార్ధుల మీద ప్రభావం గట్టిగానే పడింది అని చెప్పాలి. చాలా వరకు విద్యార్ధులు ఇప్పుడు పరిక్షల విషయంలో అసలు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏంటీ అనే దానిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చాయి. 

 

ఈ నేపధ్యంలో యూజీసీ స్పందించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. విశ్వవిద్యాలయాలు, అదే విధంగా పలు విద్యా సంస్థలచే  నిర్వహించే టెర్మినల్ సెమిస్టర్లతో పాటుగా, చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షలను ఆఫ్‌లైన్ / ఆన్‌లైన్ / బ్లెండెడ్ (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్) మోడ్‌లో సెప్టెంబర్ 2020 చివరి నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: