మహానేత వైయస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు : విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరాల 3 నెలల పాలనలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోను ఆయన విజయం సాధించారు. 2003లో మండు వేసవిలో 1460 కిలోమీటర్లు వైయస్సార్ పాదయాత్ర సాగించారు.
2004లో పులివెందులలో 40,000కు పైగా మెజారిటీతో గెలవడంతో పాటు 1460 కిలోమీటర్లు పాదయాత్ర సాగించారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో పథకాలు అమలు అమలు చేసి పేదల పెన్నిధి అయ్యారు నేడు ఆయన 71వ పుట్టినరోజు. భౌతికంగా దూరమైనా ప్రజల మనస్సుల్లో మాత్రం ఎన్నేళ్లైనా ఆయన జీవించే ఉంటారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
మహానేత డా వైయస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.#LegendYSRJayanthi#YSRForever pic.twitter.com/E2KXgp91t7 — Vijayasai reddy v (@VSReddy_MP) July 8, 2020