ప్రపంచ ఆరోగ్య సంస్థకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్...?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీ షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అధికారికంగా ఉపసంహరించుకునే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. 2021 జులై నెలలోపు ఉపసంహరణ ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. . కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.
చైనాకు కరోనా విషయంలో వత్తాసు పలుకుతూ ఉండటంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెనెటర్ బాబ్ మెనెండెజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు నోటిఫికేషన్ అందిందని చెప్పారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థలో తమ దేశం మళ్ళీ చేరేలా చూస్తానని ప్రకటన చేసి ట్రంప్ చర్యను తప్పుబట్టారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 46,329 కరోనా కేసులు నమోదు కాగా లక్షా ముప్పై వేలకు పైగా రోగులు మృతి చెందారు.