బ్రేకింగ్ : హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో దారుణం... 14 రోజులు కరోనా రోగికి నరకం చూపిన డాక్టర్లు....?

Reddy P Rajasekhar

హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో చేరిన డాక్టర్ విజయకు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి సిబ్బంది 14 రోజులు నరకం చూపించారు. ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టకపోయినా భారీగా బిల్లులు వేశారు. కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విజయ కుటుంబం ఏఐజీ ఆస్పత్రిలో చేరింది. విజయ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి, తనకు కరోనా సోకిందని... గత నెల 25న కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. 
 
ఆక్సిజన్, వెంటిలేటర్, మెడిసిన్లు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు బిల్లులు వేశారని.... ప్రశ్నిస్తే సిబ్బంది సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ప్రశ్నిస్తే డిశ్చార్జ్ చేస్తున్నారని... ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఛైర్మన్ తో మాట్లాడాలని ప్రయత్నించినా సిబ్బంది అడ్డుకుంటున్నారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: