హైదరాబాద్ లో కరోనా తక్కువే : సీపీ అంజనీ కుమార్
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వ్యాఖ్యానించారు. జాతీయ సగటుతో పోలిస్తే హైదరాబాద్లో మరణాల రేటు కూడా చాలా తక్కువగానే ఉందని పేర్కొన్నారు.
అంబర్పేట్ పోలీసు మైదానంలో పోలీస్ వాహనాలకు శానిటైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపి అంజనీకుమార్.. క్రాఫ్ట్ సంస్థ సహకారంతో అన్ని పోలీసు వాహనాలకు శానిటైజేషన్ చేయనున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు మరింత కఠినంగా శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు