బ్రేకింగ్ : కరోనాపై పోరులో భారత్ మరో ముందడుగు... గంటకు 32 పరీక్షలు చేసే చేసే యంత్రం తయారీ....?

Reddy P Rajasekhar

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కోవిడ్‌పై పోరులో వ్యాక్సిన్లు, ఔషధాల తయారీకి కేంద్రమైన భారత్ కంపెనీలు తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నాయి. కరోనా టెస్టులకు సంబంధించిన కీలక యంత్రాన్ని పూణేకు చెందిన శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. గంటకు 32 కోవిడ్ పరీక్షలు చేయగల యంత్రాన్ని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)లు తయారు చేశాయి. 
 
ఒక్క యంత్రం ద్వారా రోజుకు 400 శాంపిల్స్‌ని పరీక్షేంచే వీలుంటుందని ఒకే ఒక టెక్నీషియన్ ఉంటే సరిపోతుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి రెండు రకాల టెస్టింగ్ యంత్రాలను తయారు చేశామని, వాటిలో పెద్ద దాని ధర రూ. 40 లక్షలని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా మీడియాకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: