భారత్ లో కరోనా సామాజిక వ్యాప్తి లేదు... కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన....?
భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోం శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. దేశంలో కరోనా రికవరీ రేటు 62 శాతంగా ఉందని చెప్పారు. దేశంలో వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్టు నిర్ధారణ కాలేదని అన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో వైరస్ తీవ్రంగానే వ్యాప్తి చెందుతోందని అయితే సామాజిక వ్యాప్తి లేదని చెప్పారు.
భారత్ లో ఒక మిలియన్ జనాభాకు 558 కేసులు నమోదయ్యాయని... దేశంలో జనాభా అధికంగా ఉండటం వల్లే భారత్ మూడో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, డిల్లీ, తెలంగాణ, యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే కరోనా కేసుల శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. కాగా దేశంలో ఇప్పటివరకు 7,67,296 కరోనా కేసులు నమోదయ్యాయి.