నేడు భారత్- చైనా మధ్య మరో సారి దౌత్య చర్చలు..!

Lokesh

 

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ తమదన్న చైనా వాదనను భారత్ మరోసారి ఖండించింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల తగ్గించేందుకు శుక్రవారం దౌత్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.
సరిహద్దుల్లో శాంతి, సామరస్యం ఆవశ్యకతను భారత్​ గుర్తిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. సమస్యలను దౌత్య మార్గంలోనే పరిష్కరించుకునేందుకు సిద్ధమన్నారు. అదే సమయంలో భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు.

 

 

భారత్-చైనా సరిహద్దుల్లోని పశ్చిమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగవుతున్నాయని చైనా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ గురువారం ఒక ప్రకటన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: