ప్రేక్షకులను కనువిందు చేసిన బాహుబలి కి ఐదు సంవత్సరాలు..!
బాహుబలి ఈ సినిమా తెలుగు చిత్రసీమలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు, సూపర్ హిట్, బంపర్ హిట్ అనే మాటలు వినిపిస్తూ వచ్చాయి. కానీ బాహుబలి సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత కాసుల పంట సునామి సృష్టించింది. ఇంక అప్పటి నుంచి నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పేరు వచ్చింది. ఇంకా ఏ సినిమా రిలీజ్ అయిన బాహుబలి సినిమా రికార్డు కాకుండా మాదే కొత్త రికార్డు అని చెప్పుకోవాల్సి వస్తోంది.
తెలుగు సినిమాగా మొదలుపెట్టి ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్న బాహుబలి సినిమా ఇటు టాలీవుడ్ లోనే కాకుండా మిగిలిన అన్ని చిత్రసీమలో హీరో ప్రభాస్ కు అధిక సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఈరోజుకి బాహుబలి సినిమా వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో మరోసారి ఇ ఈ సినిమాను సినీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మొదటి లో సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక పార్టీగా అనుకొని తీశారు. కానీ సినిమా నిడివి ఎక్కువ అవడంతో రెండు భాగాలుగా తీసి చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ రేట్ ను సంపాదించుకొని చరిత్ర సృష్టించింది.
India's biggest blockbuster ever & a milestone in indian cinema the magnum opus, Baahubali-The Beginning Celebrating 5 Years
Thank you for giving us India’s biggest motion picture ever!
-#FilmReporter#Prabhas @RanaDaggubati @ssrajamouli @BaahubaliMovie #5YearsForBaahubaliRoar pic.twitter.com/pP2ivrk2ew — Film Reporter (@FilmReporterIND) July 9, 2020