బాబోయ్.. కరోనా హాట్‌స్పాట్‌గా మారుతున్న తెలంగాణ..!
దేశంలో రాను రాను కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. కాకపోతే రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. మార్చి నెలలో ఇంతగా కేసులు నమోదు కాలేదు.. లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉండటంతో కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యాయి. ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తెలంగాణలో తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు అధికంగా రాష్ట్రంలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదు కాగా, ప్రస్తుతం వీటి సంఖ్య 30 వేలు దాటిపోవడం చూస్తుంటే మహమ్మారి ఎలా వ్యాప్తి చెందుతున్నదీ అర్థం చేసుకోవచ్చు. గత పది 51.13 శాతం కేసులు నమోదు అయ్యాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవొచ్చు. గత పది రోజుల్లో అంటే జూన్ 29 నుంచి జులై 8 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 52,163 మందిని పరీక్షించగా, 15,117 కేసులు వెలుగు చూశాయి. అంటే ఈ పది రోజుల్లో 29 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.