కరోనా సంక్షోభంలో భారతీయ సంస్థలు కీలక నిర్ణయం..?
కేంద్ర ప్రభుత్వం చైనా కు సంబంధించిన 59 పాపులర్ యాప్స్ ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మేడిన్ ఇండియా నినాదం తెరమీదకి తెచ్చారు. ప్రతి ఒక్కరు మేడిన్ ఇండియా యాప్స్ మాత్రమే వాడాలి అంటూ తెలిపారు.
ఇక ఒక్కసారిగా నెటిజన్లు ఎంతగానో ఉపయోగించే చైనా యాప్స్ నిషేధానికి గురి కావడంతో ప్రస్తుతం వినియోగదారులందరూ మేడిన్ ఇండియా యాప్స్ కోసం వెతుకులాట ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని మేడిన్ ఇండియా యాప్స్ విశేష ఆదరణ లభిస్తోంది. ఇక చైనా యాప్స్ నిషేధానికి గురి కావడంతో ఎంతో మంది నిరుద్యోగులు కాగా పలు కంపెనీలకు ఆయా ఉద్యోగులకు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు . అయితే కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ తమ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించి టీమ్స్ ని ఎంతగానో పెంచుతామని భారతీయ సంస్థలు తెలిపాయి.