కరోనాపై భారత్ గెలవగలదు : అమిత్ షా

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో 25,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా గురించి కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా తాజాగా మాట్లాడారు. ప్రపంచంలోని చాలా దేశాలు అతి పెద్ద జనాభా గల భారత్ కరోనా నుంచి ఎలా బయటపడగలదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. 
 
కానీ భారత్ కరోనాను కట్టడి చేస్తున్న తీరును చూసి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. భారత్ తలుచుకుంటే ఉగ్రవాదం మీదే కాదు... కరోనాపై కూడా గెలవగలదని చెప్పారు. కరోనాను కట్టడి చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ కార్మికులకు అమిత్ షా సెల్యూట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: