బ్రేకింగ్ : బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇంట్లో కరోనా కలకలం... నలుగురు కుటుంబ సభ్యులకు పాజిటివ్....?
బాలీవుడ్ ప్రముఖులు కరోనా భారీన పడుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యులు కరోనా భారీన పడ్డారు. అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. తన తల్లి, సోదరుడు సహా నలుగురు కుటుంబ సభ్యులు కరోనా భారీన పడినట్లు తెలిపారు.
గత కొంతకాలంలో అనుపమ్ ఖేర్ తల్లి సరిగ్గా తిండి తినకపోవడంతో వైద్యుల సూచనల మేరకు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అనంతరం కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నలుగురు కరోనా భారీన పడినట్టు తేలింది. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తన తల్లి చికిత్స పొందుతున్నారని అనుపమ్ ఖేర్ తెలిపారు.