హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ..!
2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్ బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించారు పాక్ అధికారులు.
ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలపై హఫీజ్‌ను గతేడాది జులై 17న పాక్ పోలీసులు అరెస్టు చేశారు.