బ్రేకింగ్ : డిజిట‌ల్ ఇండియాలో 75వేల కోట్ల రూపాయల గూగుల్ పెట్టుబ‌డులు

Reddy P Rajasekhar

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ భారతీయులకు శుభవార్త చెప్పారు. గూగుల్ సంస్థ డిజిట‌ల్ ఇండియాలో భారీ పెట్టుడులు పెట్టనున్నట్లు కీలక ప్రకటన చేశారు. భార‌తీయ స్టార్టప్స్ ‌లో సుమారు 75 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన భార‌తీయ ఆవిష్క‌ర్త‌ల‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని చెప్పవచ్చు. ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల నిధుల‌తో భార‌తీయ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయనునట్లు సుందర్ పిచాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 
 
ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజన్ తో పని చేస్తున్న తీరు పట్ల పిచాయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈరోజు ఉదయం సుందర్ పిచాయ్ తో పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: