ఆ ఇద్దరు హీరోయిన్లకు చాలెంజ్ విసిరిన రష్మిక..
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కి ప్రస్తుతం విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సమంత.. రష్మిక కు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత చాలెంజ్ ను స్వీకరించిన రష్మిక మందన తాజాగా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతు దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.
గ్రీన్ ఛాలెంజ్లో తనను భాగస్వామ్యం చేసిన సమంతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది రష్మిక మందన. అంతే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు రాశికన్నా, కళ్యాణి ప్రియదర్శన్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరింది రష్మిక మందన్న. అటు ఎంతో మంది నెటిజన్లు కూడా గ్రీన్ చాలెంజ్ పై స్పందిస్తూ మొక్కలు నాటుతుండటం విశేషం..