'ఆర్న' సినిమాను లాంచ్ చేయనున్న విశ్వక్ సేన్..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో యువహీరో విశ్వక్సేన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. తనదైన ఆటిట్యూడ్ తో  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఫలక్నామా దాసు సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన విశ్వక్సేన్... ఇటీవలే హిట్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హిట్ అందుకొని క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే, అయితే యువ హీరో విశ్వక్సేన్ ఈరోజు ఒక మూవీ ని లాంచ్ చేయబోతున్నారు.



 ప్రసాద్ చవాన్  దర్శకత్వంలో.. నీరు  ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన  సినిమాని ఈరోజు సాయంత్రం  5 గంటలకు యువ హీరో విశ్వక్సేన్ లాంచ్  చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. ప్రస్తుతం విశ్వక్సేన్ ఈ సినిమాను ఈరోజు 5 గంటలకు లాంచ్ చేస్తున్న నేపథ్యంలో నెటిజనులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు,

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: