తెలంగాణకు 71 ఒంటెలు ఎలా వచ్చాయి...?

కొన్ని పండగలు వస్తే ఒంటె మాంసం విక్రయ౦ అనేది మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే  ఒక పండగ కోసం తెచ్చిన 71 ఒంటెలు తెలంగాణలో సంచలనంగా మారాయి. హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ కె.శశికళ హైకోర్ట్ లో ప్రజాహిత వ్యాఖ్యం దాఖలు చేసారు. ఒంటెల తరలింపును అడ్డుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న ఒంటెల సంరక్షణకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలపాలని ఆమె కోరారు.

 

అంతే కాకుండా  ఒంటె మాంసం విక్రేతలపై చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే 71 ఒంటెలు తెలంగాణా వచ్చాయి అని హైకోర్ట్ దృష్టికి వెళ్ళగా ఎడారి ప్రాంతం కాని తెలంగాణాలో ఏ విధంగా ఒంటెలు వచ్చాయని హైకోర్ట్ నిలదీసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌ కుమార్‌ దీనిపై హైకోర్ట్ కి వివరణ ఇచ్చారు. వాటిని తిరిగి రాజస్థాన్ పంపించామని... ఆయన చెప్పగా ఏ విధానాన్ని వాటి తరలింపుని అడ్డుకోవడానికి అనుసరిస్తున్నారో చెప్పాలని హైకోర్ట్ ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: