తూర్పుగోదావరి జిల్లాలో అద్భుత దృశ్యం..?

praveen
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. భూమి నుంచి ఏకంగా ఆకాశానికి టోర్నడో వెళ్తున్న ఓ అద్భుత దృశ్యాన్ని చూసి స్థానికులు అందరూ ఎంతగానో  ఆశ్చర్యానికి గురయ్యారు. మామూలుగా అమెరికా ప్రాంతంలో ఇలాంటి టోర్నడో లు  ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఇక తాజాగా ఎప్పుడు చూడని విధంగా భూమి నుంచి ఆకాశానికి టోర్నడో  ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా తిలకించారు జనం. అయితే ఈ అరుదైన దృశ్యాన్ని ఎంతో మంది స్థానికులు తమ మొబైల్లో బంధించారు. తూర్పుగోదావరి జిల్లా యానం వద్ద ఈ అద్భుత ఘటన చోటుచేసుకుంది.



గతంలో కూడా భైరవపాలెం సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సముద్రం నుంచి ఆకాశానికి టోర్నడో ఏర్పడడంతో మత్స్యకారులు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఏనుగు తొండం లా  ఉంది అంటూ ఆ దృశ్యాన్ని చరవాణిలో బందించగా ఆ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: