జేపీ నడ్డా తో రఘురామకృష్ణంరాజు భేటీ..?

praveen

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ కార్యాలయంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భేటీ కావడం మరింత  సంచలనంగా మారిపోయింది. పార్లమెంటరీ చైర్మన్ హోదాలో ఉన్న జేపీ నడ్డా ను  రఘురామకృష్ణంరాజు కలిసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో  జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న రఘురామకృష్ణంరాజు... పలు విషయాల్లో  ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 

 ఈ క్రమంలోనే  రఘురామకృష్ణంరాజు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ ఏకంగా సొంత పార్టీ ఎంపికే షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ లు  వైసీపీ ఎంపీలు ఫిర్యాదు కూడా చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్లమెంటరీ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న జేపీ నడ్డా ను కలవడం మరింత చర్చనీయాంశంగా మారింది,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: