ఆ దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా...?
భారత్ లో గత నాలుగున్నర నెలలుగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మాస్కు ధరించినా, భౌతిక దూరం పాటిస్తున్నా వైరస్ భారీన పడుతున్నామని పలువురు చెబుతున్నారు. మన దేశంతో పాటు ఇతర దేశాలను కూడా వైరస్ గజగజా వణికిస్తోంది. తాజాగా ఇరాన్ దేశ అధ్యక్షుడు తమ దేశంలో రెండున్నర కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఆరోగ్య శాఖ చేసిన చేసిన అధ్యయనంలో ఊహించని స్థాయిలో కేసులు కనిపిస్తున్నాయని ఆగష్టు నాటికి మూడు కోట్ల మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని తెలిపారు. ఇరాన్ లో గడిచిన 24 గంటల్లో 2,166 కరోనా కేసులు నమోదు కాగా కరోనా కేసుల సంఖ్య 2,70,000కు చేరింది. ఇప్పటివరకు 13,973 మంది వైరస్ భారీన పడే అవకాశం ఉందని తెలుస్తోంది.