భారత్ లో మొదలైన కరోనా సామాజిక వ్యాప్తి.... ఇకపై లక్షల్లో కేసులు....?

Reddy P Rajasekhar

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారత్ లో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైందని పరిస్థితి ఏ మాత్రం బాలేదని హెచ్చరించింది. సగటున రోజుకు 30వేల కేసులు నమోదవుతున్నాయని... గ్రామాల్లో కూడా కేసులు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఐ.ఎం.ఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ వీకే మోంగా దేశంలో 70 శాతం మంది వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధకత వస్తుందని టీకాల ద్వారా కూడా వ్యాధి నిరోధకత సాధించడం సాధ్యమని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశంలో సామాజిక వ్యాప్తి మొదలు కాని సమయంలోనే వేలల్లో కేసులు నమోదవుతూ ఉండటంతో ఇకపై లక్షల్లో కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: