శ్రీశైలం ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న సుందర్ చివరి మాటల వీడియో...!

శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ఎఈ సుందర్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. మోహన్ అయిపోయింది మన పని అయిపోయింది. ఇక ఆశలు వదులుకో... ఇక మనం చనిపోతున్నాం.  ఇక మనం బతకం ప్రాణాలపై ఆశలు వదులుకో. అంటూ సుందర్  అన్నాడు. మోహన్ ఈ వీడియో ని షూట్ చేసాడు.


ఈ వీడియో ని కాసేపటి క్రితం విడుదల చేసారు. చనిపోవడానికి ముందు ఇద్దరూ కూడా భయంతో వణికిపోయారు. అంతకు ముందే సుందర్ తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ వీడియో లో ఉన్నవి భయానక దృశ్యాలు. మొత్తం పొగతో ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉంది. ఈ వీడియో చూసిన వారు కన్నీరు పెడుతున్నారు. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: