మొదలైన ప్రణబ్ చివరి ప్రయాణం...!
కాసేపటి క్రితం ఆయన అంతిమయాత్ర ప్రారంభం కాగా మధ్యాహ్నం రెండు గంటలకు లోది రోడ్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు కేవలం కొద్దిమంది మాత్రమే హాజరవుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు అధికారులు. ఇప్పటికే ఆయన మరణించిన నేపథ్యంలో ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటిస్తున్నారు. ఇక ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదిక గా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.