దుబ్బాక ఉప ఎన్నికలో.. బిజేపి చూపు అతని మీద..!

Lokesh
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో బిజేపి అభ్యర్థిగా ఎం.రఘునందన్ రావును అధిష్ఠానం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే రఘునందన్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం దుబ్బాక ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రఘునందన్ రావు పేరు దాదాపు ఖరారైంది. మంగళవారం జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది.

అభ్యర్థిని అధికారికంగా ప్రకటించక ముందే ప్రచారంలో దూసుకెళ్లిన కమలనాథులు ఇప్పుడు మరింత హోరెత్తించనున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా సోలిపేట సుజాత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్​ పార్టీ వారు ఇంక అభ్యర్థిని ప్రకటించలేదు.సీఎం కేసీఆర్​పై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్ర విమర్శలు గుప్పించారు. అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కై బయటకి వచ్చి ఏపీని హెచ్చరించానని కేసీఆర్​ హెచ్చులు కొట్టడం సిగ్గుమాలిన చర్యగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: