బిర్యాని కోసం 1.5 కిలోమీటర్ల క్యూ

మన ఇండియాలో బిర్యాని అంటే చాలా మందికి పిచ్చి అనే సంగతి తెలిసిందే. బిర్యాని కోసం బారులు తీరుతూ ఉంటారు కొన్ని చోట్ల. తాజాగా కర్ణాటకలో ఇలాగే బారులు తీరారు ఒక బిర్యాని సెంటర్ దగ్గర. ఎంత దూరమో తెలిస్తే షాక్ అవుతారు. దాదాపుగా 1.5 కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. ఒక కస్టమర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎందుకు నిలబడ్డామో చెప్పాడు.

బిర్యాని కొనడానికి హోస్కోట్‌ లోని ఈ బిర్యాని సెంటర్ కి వచ్చామని చెప్పాడు. "నేను ఇక్కడ ఉదయం 4 గంటలకు వచ్చాను, కాని ఉదయం 6:30 గంటలకు నా ఆర్డర్ వచ్చింది. ఎందుకంటే బిర్యానీకి 1.5 కిలోమీటర్ల పొడవైన క్యూ ఉంది. ఆహారం చాలా రుచికరమైనది, వేచి ఉండాల్సిన అవసరం ఉంది." అని మీడియాకు చెప్పాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: