స్పందించాలి లేకపోతే చర్యలు తప్పవు.. సుప్రీం హెచ్చరిక..!
వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం, ఒప్పంద వ్యవసాయ చట్టంతో పాటు నిత్యావసర వస్తువుల సవరణ చట్టాలను తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రతో సెప్టెంబరు 27 నుంచి ఈ నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ చట్టాలను కాంగ్రెస్ సహా పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణాలో ఖేతీ బచావో యాత్ర చేపట్టారు. ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.