మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని టికురీ గ్రామంలో 16ఏళ్ల బాలికపై ఆమె మామయ్య, అతడి స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. అధిక రక్తస్రావంతో బాధపడుతున్న ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ నెల 8న పుట్టిన రోజు పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న బాలికను.. మామయ్య, అతడి స్నేహితుడు కత్తితో బెదిరించి, ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
దీంతో రేవా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబసభ్యులు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన వనస్పతి రావత్, అంకిత్ రావత్లుగా గుర్తించారు.నిర్మానుష్య ప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే కత్తితో పొడిచి చంపెస్తామని నిందితులు బెదిరించినట్లు చెప్పింది.