ఏపీ డీజీపీ కోసం ఏకంగా సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు...!
ఏపీ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు అడ్వకేట్ కోటేశ్వర రావు. పోలీస్ శాఖ ను కించపరిచే విధంగా హైకోర్టులో వ్యాఖ్యానించడం తగదని పిటిషన్ వేసారు. హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కిందిస్థాయి సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఫిర్యాదు చేసారు. కోటేశ్వరావు పిటిషన్ ను పీల్ గా స్వీకరించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ కొరకు వాయిదా వేసింది సుప్రీం.