హెల్మెట్ ధరించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!
రహదారి ప్రమాదాలు, తద్వారా సంభవించే మరణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు నియమించిన రహదారి భద్రతా కమిటీ చేసిన సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు.మోటార్ వెహికల్ చట్టంలోని 129 సెక్షన్ ప్రకారం ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. వాహన చోదకులే కాకుండా వెనుక కూర్చొనేవారు కూడా (నాలుగేళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ) హెల్మెట్ ధరించాల్సిందేనని కర్ణాటక మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి.