సైన్యం కోసం సిక్కింలో మరో రహస్య రహదారి..!
విజయదశమి సందర్భంగా.. డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మారకం వద్ద ఆయుధ పూజ నిర్వహించారు రాజ్‌నాథ్. సైనిక ఆయుధాలకు పూజలు చేశారు. ఈ వేడుకలో సైన్యాధిపతి జనరల్ నరవాణే పాల్గొన్నారు.ఆయుధ పూజ అనంతరం టేవర్ అసాల్ట్ రైఫిల్ పని తీరును పరిశీలించారు రాజ్‌నాథ్. దాని సామర్థ్యాన్ని, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత.. సిక్కింలో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) ఇటీవలే నిర్మించిన ఓ రహదారిని ప్రారంభించారు రాజ్‌నాథ్. సుక్నాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది.