ఇంధన డిమాండ్ లో భారత్ టాప్..!

Lokesh
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తగ్గిన చమురు డిమాండ్‌ను భారత్‌ పెంచుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రానున్న కాలంలో భారత్‌లో ఇంధన వినియోగం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ ఫోరం నాల్గో విడత సమావేశంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు.

2022 నాటికి సౌర, పవన విద్యుత్ రంగంలో 175 గిగావాట్ల ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని భారత్‌ చేరుకుంటోందని పేర్కొన్నారు.ఈ ఏడాది ఇంధన సంస్థలకు సవాలుతో కూడుకున్నదని మోదీ అన్నారు. ఇంధన డిమాండ్ మూడింట ఒకవంతు పడిపోయిందని చెప్పారు. అయితే.. ధరల విషయంలో చమురు, సహజవాయు ఉత్పత్తి సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: