చినబాబుపై పోలీసుల కేసు... ఆయన ఏమంటున్నారు...?
వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా అని ఆయన అన్నారు. కాగా నిన్న లోకేష్ నడిపిన ట్రాక్టర్ అదుపు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.