సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుగా ఓడించి 88 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ.. 19 ఓవర్లకే 131 పరుగులు చేసి ఆల్ఔట్ అయ్యింది. విజయంలో వృద్ధిమాన్ సాహా (87; 45 బంతుల్లో, 12×4, 2×6), డేవిడ్ వార్నర్ (66; 34 బంతుల్లో, 8×4, 2×6), మనీష్ పాండే(44) కీలక పాత్ర పోషించారు.
రెండో ఇన్నింగ్స్ చేసిన ఢిల్లీలో రిషభ్ పంత్(36) టాప్ స్కోరర్. రహానే(26) నామమాత్రంగా ఆడాడు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్(3), సందీప్ శర్మ(2), నటరాజన్(2), హోల్డ్ర్, విజయ్ శంకర్, షబాజ్ నదీమ్ తలో వికెట్ తీశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: