16 రకాల కూరగాయలకు కనీస ధర ప్రకటించిన కేరళ..!

Lokesh
రైతులకు మద్దతుగా నిలిచేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో పండించే పంటలకు కనీస ధర నిర్ణయించింది. మొదటి దశలో 16 రకాల కూరగాయలకు ధరలను ఖరారు చేసింది. నవంబరు 1నుంచి ఇవి అమల్లోకి వస్తాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. మార్కెట్​లో అస్థిరత నెలకొన్న సమయంలో రైతులకు అండగా నిలబడేలా ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం కేరళ అని ఆయన వెల్లడించారు.

మొదటి దశలో భాగంగా అరటి, బంగాళదుంప, క్యారట్, చిలకడదుంప, బెండకాయ, బూడిద గుమ్మడి, కాకరకాయ, టమాటో, పైనాపిల్​, వెల్లుల్లి, పొట్లకాయ, దోసకాయ, క్యాబెజ్​, బీట్​రూట్, చిక్కుడు వంటి కూరగాయలకు కేరళ ప్రభుత్వం కనీస ధర నిర్ణయింది. ఒకవేళ మార్కెట్ ధర.. కనీస ధర కంటే తక్కువగా ఉంటే అప్పుడు ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుంది. కూరగాయలకు కనీస ధర చెల్లిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: