ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని ఈసీ గ్రీన్ సిగ్నల్..!
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. బిజెపి చేసిన హామీ.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి రాదని వెల్లడించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఎనిమిదో భాగంలో పార్టీల ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలున్నాయని పేర్కొంది. ఈ మార్గదర్శాకాల ప్రకారం చూస్తే.. ఉచిత కరోనా టీకా హామీ వాటిని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. సంక్షేమం కోసం ఈ హామీని ప్రణాళికలో చేర్చడం తప్పేమీ కాదని తెలిపింది.