అరాచకాల చీకట్ల నుంచి: చంద్రబాబు
అరాచకాల చీకట్ల నుంచి ఆనందపు వెలుగుల వైపు నడిపించే వెలుగు దివ్వెల పండుగ దీపావళి అని ఆయన పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారు అందరికీ నరక చతుర్దశి, దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ మీరంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ఈ దీపావళి మీకు సకల శుభములు చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.