వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..!

N.ANJI
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగతూనే ఉంది. సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఈ మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా ఈ మహమ్మారి బారిన పడ్డాడు.
నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కరోనా సోకింది. సోమవారం ఆయన పాల్గొనవలసిన పాదయాత్రను పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే తో పాటు ఎఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. ఇటీవల అనేక కార్యక్రమాలలో ఎమ్మెల్యే చురుకుగా పాల్గొన్నారు. వారిద్దరూ చికిత్స నిమిత్తం చెన్నైకి వెళ్లినట్టుగా సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు వివిధ పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: