జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు జనసేన ప్రకటించింది. తమ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోరు సాగనుంది. టీఆర్ఎస్-మజ్లిస్ కలిసి బరిలో దిగనుండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి బరిలో దిగి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది.
ఇక ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదు. కానీ దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్.. బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన ప్రకటించడం.. బీజేపీ అభిమానుల్లో టెన్షన్‌కు కారణమైంది.
మరింత సమాచారం తెలుసుకోండి: