2 లక్షలు ఇవ్వాలని వృద్దురాలికి చెప్పలేని చోట వాతలు పెట్టాడు

వడ్డీ వ్యాపారాలు చేసే వారు వేధించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్ల లో వడ్డీ వ్యాపారి పరమేశ్వరావు  అరాచకం వెలుగులోకి వచ్చింది. 2 లక్షల నగదు కోసం ఓ కుటుంబాన్ని కిడ్నాప్  చేసారు. 83 ఏళ్ళ తండ్రీని, 65 ఏళ్ళ తల్లి ని , ఇద్దరు పిల్లల్ని నిర్బందం చేసారు.

ఓ గదిలో నెల రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. 65 ఏళ్ళ తల్లికి గజ్జలు, రొమ్ముల పై వాతలు పెట్టారు. బలవంతంగా ఖాళీ నోట్లు పై సంతకాలు చేయించుకున్న పరమేశ్వరరావు... ఇల్లు , బంగారం స్వాధీనం చేసుకున్నాడు. బయటకు చెబితే చంపుతామని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన కుటుంబం... ఎస్పీకి ఫిర్యాదు  చేసారు. ఈ ఘటన సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: