వ్యాక్సిన్ ఈ నెల చివర్లోనే ఇండియాలో...?

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పరిక్షలు చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తయారి విషయంలో ఇప్పుడు మన దేశంలో మూడు కంపెనీలు దూకుడుగా ఉన్నాయి. ఇక తాజాగా ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన ప్రకటన చేసారు. కోవిడ్ -19 వ్యాక్సిన్లు మరియు టీకా పంపిణీ ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తుండటంతో, ఈ నెల చివరినాటికి లేదా జనవరి ప్రారంభంలో కరోనావైరస్ వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
ఈ నెల చివరినాటికి లేదా వచ్చే నెల ప్రారంభంలో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించడానికి భారత నియంత్రణ అధికారుల నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందాలని ఆశిస్తున్నామని వెల్లడించారు. తగిన స్టోర్‌ హౌస్‌ లు అందుబాటులో ఉంచడం, వ్యూహాన్ని సిద్దం చేయడం, టీకాలు వేయడం మరియు సిరంజిల లభ్యత వంటి వాటికి సంబంధించి టీకా పంపిణీ ప్రణాళిక కోసం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: