జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జగన్ రెడ్డి గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు అని విమర్శించారు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదు అన్నారు. మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతన్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి అని ఆరోపించారు.

పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ద మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి అన్నారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: