మంత్రి అనిల్ టార్గెట్‌గా ఆనం మ‌ళ్లీ సంచ‌ల‌నం

VUYYURU SUBHASH
మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ టార్గెట్‌గా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనం కుటుంబానికి నెల్లూరు పట్టణంతో విడదీయలేని సంబంధం ఉందన్న ఆయ‌న .. తాము ఏ పార్టీ నుంచి.. జిల్లాలో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాథినిత్యం వ‌హించినా నెల్లూరు ప‌ట్ట‌ణంతో త‌మ‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంటుంద‌ని.. నెల్లూరు నుంచి త‌మ‌ను ఎవ్వ‌రూ వేరు చేయ‌లేర‌ని కూడా ఆనం బాంబు పేల్చారు.

తాను నెల్లూరు నుంచే గ‌తంలో రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు వెళ్లానని, ఇప్పడు వెంకటగిరి వెళ్లానని చెప్పారు. ఎక్కడకు వెళ్లినా నెల్లూరు నుంచి తమ కుటుంబాన్ని ఎవరూ వేరు చేయలేరని.. నెల్లూరుపై త‌మ మార్క్ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పారు. ఇక ఆనం నెల్లూరు న‌గ‌రంపై తాను గ్రిప్ వ‌దులుకోన‌ని చెప్ప‌డం ద్వారా మంత్రి అనిల్ సీటుపై దృష్టి పెట్ట‌డంతో పాటు ఆయ‌న‌కు ఎస‌రు పెట్టే ప్ర‌క్రియ స్టార్ట్ చేశార‌న్న గుస‌గుస‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: