జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొత్త కార్య‌క్ర‌మం ఇదే... 100 రోజులు వ‌రుస‌గా...

VUYYURU SUBHASH
ఏపీలో వ‌రుస‌గా సంక్షేమ ప‌థ‌కాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌తో దూసుకు పోతోన్న సీఎం జ‌గ‌న్ తాజాగా మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. వంద రోజుల పాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు స్వచ్ఛంద సేవాసంస్థలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని జగన్ కోరారు. దీనికి ఏపీ సీఎం క్లాప్ పేరుతో ప్రజల్లో అవగాహన కల్పించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: